'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన తాజా అప్డేట్

by సూర్య | Thu, Feb 22, 2024, 07:34 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఆదివారం ప్రారంభమైన ప్ర‌స్తుత షెడ్యూల్ చ‌క్క‌గా సాగుతోంది. రామ్‌చరణ్ మరియు నవీన్‌చంద్రపై RFC హైదరాబాద్ లో యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ మార్చి 2 వరకు జరగనుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
విజయ్ సేతుపతి 'మహారాజ' మూవీ చైనాలో కూడా మాస్ కలెక్షన్... Thu, Dec 12, 2024, 12:50 PM
మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట Thu, Dec 12, 2024, 12:17 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'బరోజ్ 3డి' Thu, Dec 12, 2024, 12:12 PM
'గేమ్ ఛేంజర్' కొత్త ప్రోమోని విడుదల చేసిన శంకర్ Thu, Dec 12, 2024, 12:07 PM
6 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్ళని సాధించిన 'పుష్ప 2'... Thu, Dec 12, 2024, 12:05 PM