'మెర్రీ క్రిస్మస్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా?

by సూర్య | Thu, Feb 22, 2024, 07:23 PM

శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 'మెర్రీ క్రిస్మస్' సినిమా జనవరి 12, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మార్చి 8, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తుంది. ఈ హిందీ వెర్షన్‌లో సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్ మరియు తిను ఆనంద్ నటించగా, తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జై బాబు మరియు రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో నటించారు. మెర్రీ క్రిస్మస్ సినిమాకి ప్రీతమ్ సంగీతం అందించారు. మ్యాచ్‌బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM