'కంగువ' టీజర్ విడుదలపై లేటెస్ట్ బజ్

by సూర్య | Thu, Feb 22, 2024, 07:14 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క యాక్షన్ ప్యాక్డ్ టీజర్ అభిమానులలో మరియు ట్రేడ్ వర్గాల్లో అంచనాలను పెంచింది. సూర్య ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా టీజర్  విడుదల తేదీని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నట్లు లేటెస్ట్ టాక్.


ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM