100M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'భామాకలాపం 2'

by సూర్య | Wed, Feb 21, 2024, 08:49 PM

టాలీవుడ్ బ్యూటీ ప్రియమణి నటించిన భామాకలాపం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన "భామాకలాపం 2" ఆహా వీడియోలో ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హిట్ సిరీస్ ఇప్పటివరకు 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


క్రైమ్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రియమణితో పాటు సీరత్ కపూర్, బ్రహ్మాజీ మరియు శరణ్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అభిమన్యు దర్శకత్వం వహించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. విప్లవ్ నిషాదం ఎడిటర్‌గా, కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
ఈ నెల 14న విడుదలకానున్న ‘బ్రహ్మా ఆనందం’ Wed, Feb 12, 2025, 12:23 PM
మీరెంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు Wed, Feb 12, 2025, 12:21 PM
అల్లు అర్జున్ తో సినిమా చేయనున్న అట్లీ Wed, Feb 12, 2025, 12:18 PM
ఓరినీ అభిమానం చల్లంగుండ Wed, Feb 12, 2025, 12:14 PM
అస్వస్థతకి గురైన కమెడియన్ పృథ్వీ రాజ్ Wed, Feb 12, 2025, 12:12 PM