'పుష్ప 2' స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ

by సూర్య | Wed, Feb 21, 2024, 06:30 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. సుకుమార్ చిత్రాలలో స్పెషల్ సాంగ్ తప్పకుండ ఉంటుంది. ఈ సీక్వెల్ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కనిపించనున్నట్లు  ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ టాక్.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
"తెలంగాణలో అఖండ 2 టికెట్ ప్రైస్ బూస్ట్! కొత్త రేట్లు బయటకు!" Thu, Dec 04, 2025, 07:59 PM
సినిమాలు వదిలి స్కూల్‌కు వెళ్తున్న స్టార్ హీరోయిన్ Thu, Dec 04, 2025, 07:39 PM
ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్ Thu, Dec 04, 2025, 04:14 PM
హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈషా చూడొద్దు: బన్నీ వాసు Thu, Dec 04, 2025, 03:27 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్‌టైమ్ 3 గంటల15 నిమిషాలు! Thu, Dec 04, 2025, 03:16 PM