ఈ తేదీన 'విశ్వంభర' సెట్స్ లో జాయిన్ కానున్న మెగా స్టార్

by సూర్య | Wed, Feb 21, 2024, 06:17 PM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ దర్శకుడు వస్సిష్ట మల్లిడితో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రకటన మొదటి రోజు నుండి అభిమానులలో విపరీతమైన అంచనాలను సృష్టించింది. ఈ భారీ బడ్జెట్ సినిమా చిరంజీవి కెరీర్‌లో 156వ ప్రాజెక్ట్.

తాజాగా ఇప్పుడు ఫిబ్రవరి 24న మెగా స్టార్ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది. రచయిత-నటుడు నుండి దర్శకుడిగా మారిన హర్ష వర్ధన్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.


ఈ ఫాంటసీ డ్రామా జనవరి 10, 2025న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM