అరుణ్ విజయ్ 'వనంగాన్' టీజర్ అవుట్

by సూర్య | Tue, Feb 20, 2024, 05:20 PM

కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్ తన తదుపరి సినిమాని స్టార్ డైరెక్టర్ బాలాతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'వనంగాన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ వనంగాన్ టీజర్‌ను ఆవిష్కరించారు. ఒక నిమిషం నిడివిగల ఈ టీజర్ కన్యాకుమారి నుండి వివిధ షాట్‌లతో ప్రారంభమైంది. మిస్కిన్ లాయర్ పాత్రలో కనిపిస్తుండగా, సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు.

ఈ సినిమాలో రోషిణి ప్రకాష్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. రిధా, ఛాయాదేవి, బాల శివాజీ, షణ్ముగరాజన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ అందించనున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. B స్టూడియోస్‌తో కలిసి సురేష్ కామచ్చి యొక్క V హౌస్ ప్రొడక్షన్స్ ద్వారా బాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM