'కల్కి 2898AD' గురించిన తాజా బజ్

by సూర్య | Tue, Feb 20, 2024, 04:49 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. మూడు నెలల్లో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది.


లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో 9 భాగాలు ఉంటాయని సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారకంగా ప్రకటించనప్పటికీ ఈ వార్త ఆన్లైన్ లో వైరల్ అవుతుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ ప్రపంచవ్యాప్తంగా మే 9, 2024న విడుదల కానుంది.


ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్,మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM