రాయన్ గా రానున్న ధ‌నుష్

by సూర్య | Tue, Feb 20, 2024, 01:46 PM

త‌మిళ, తెలుగు భాష‌ల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు ధ‌నుష్. కెప్టెన్ మిల్ల‌ర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ వంటి హిట్ త‌ర్వాత చేస్తున్న చిత్రం రాయన్ . డీ 50 గా వ‌స్తున్న ఈ సినిమా టైటిల్‌ను సోమ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించారు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వ‌యంగా ధ‌నుషే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా సందీప్ కిష‌న్ , కాళిదాస్, ఎస్‌జే సూర్య‌, ఆప‌ర్ణ బాల ముర‌ళి, అనైక సురేంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.గ‌త డిసెంబ‌ర్‌లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా తాజాగా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్‌లో ధ‌నుష్‌తో పాటు సందీప్ కిష‌న్, కాళిదాస్ మంచి యాక్ష‌న్ మోడ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. చెన్నైలో గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ప‌వ‌ర్ పాండి అనే సినిమాకు ద‌ర్శ‌కత్వం చేసిన ధ‌నుష్ మ‌ళ్లీ ఇన్నాళ్లకు ఈ రాయన్  చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించడం విశేషం. త్వ‌ర‌లో మ‌రో చిత్రాన్ని కూడా ధ‌నుష్ డైరెక్ట్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.ఏఆర్ రెహ‌మాన్  సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో తీసుకు వ‌స్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ధ‌నుష్ గుడ్డు కొట్టించుకున్న‌ట్లు తెలుస్తోండ‌గా ఆ స్టిల్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ఫొటోలో ఉన్న‌ది నువ్వేనా ఏంటీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ అంటూ సినీ అభిమానులు ఆశ్చ‌ర్య పోతున్నారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM