బిగుతైన డ్రెస్ లో కియారా

by సూర్య | Thu, Dec 07, 2023, 11:16 AM

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా తన లుక్ తో ఆకట్టుకుంది. ఆమె ఇచ్చిన కొన్ని స్టన్నింగ్ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. అప్పటికే బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనూ కొన్ని చిత్రాలు చేసింది. ఇక్కడి ఆడియెన్స్ కు దగ్గరైంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘మహర్షి’  చిత్రంతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా ‘వినయ విధేయ రామ’లో నటించి మెప్పించింది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే..  తాజాగా కియారా అద్వానీ సెన్సేషనల్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’  లో మెరిసింది. బాలీవుడ్ స్టార్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌషల్ తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా తన గురించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. కాగా, కియారా లుక్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో హాట్ బ్యూటీ అందాలను ప్రదర్శించింది. బిగుతైన డ్రెస్ లో ఘాటుగా ఫొటోలకు ఫోజులిస్తూ మతులు పోగొట్టింది. టాప్ గ్లామర్ షోతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. కియారా ఇచ్చిన స్టన్నింగ్ స్టిల్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అమ్మడు అందాల ప్రదర్శనకు నెటిజన్లూ ఖుషీ అవుతూ ఫొటోలను లైక్ చేస్తున్నారు. మరికొందరు ఆమె అందాన్ని వర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరింతగా ఎంకరేచేస్తున్నారు. 


 


 


 





Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM