మరో క్రొత్త దర్శకుడితో నాగార్జున

by సూర్య | Wed, Dec 06, 2023, 11:53 AM

కొత్త దర్శకులకు అవవకాశం ఇవ్వడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆయన ‘నా సామిరంగ’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కుర్రాడు బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తుతున్నాడు. ఈలోగా మరో కొత్త దర్శకుడికి నాగ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు టాక్‌. అతనే...అనిల్‌. తమిళంలో ఒకట్రెండు సినిమాలు చేసిన అనిల్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. ఇటీవల నాగ్‌కి ఓ కథ చెప్పాడు అనిల్‌. దానికి నాగ్‌ పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘లవ్‌ యాక్షన్‌ రొమాన్స్‌’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్టు టాక్‌. ఓ అగ్ర కథానాయిక నాగ్‌ సరసన నటించబోతోందని, ఆమె పేరు కూడా త్వరలోనే వెల్లడిస్తారని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘నా సామిరంగ’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరవాతే... ‘లవ్‌ యాక్షన్‌ రొమాన్స్‌’ పట్టాలెక్కొచ్చు. శేఖర్‌ కమ్ముల, ధనుష్‌ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రంలోనూ నాగ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Latest News
 
'అమరన్' ట్రైలర్ అవుట్ Wed, Oct 23, 2024, 08:30 PM
ధనుష్, ఐశ్వర్య షాకింగ్ నిర్ణయం Wed, Oct 23, 2024, 07:42 PM
వార్ 2: హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ పరిచయ సన్నివేశాల గురించి ఆసక్తికరమైన బజ్ Wed, Oct 23, 2024, 07:36 PM
గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్! Wed, Oct 23, 2024, 07:34 PM
'క' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, Oct 23, 2024, 07:31 PM