ఆల్ టైమ్ రికార్డ్ ధరకు అమ్ముడయిన 'హాయ్ నాన్న' ఆడియో రైట్స్

by సూర్య | Tue, Dec 05, 2023, 04:15 PM

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని తన 30వ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'హాయ్ నాన్నా' అనే టైటిల్‌ను మూవీ మేకర్స్ ఖరారు చేసారు. తాజగా ఇప్పుడు హాయ్ నాన్న ఆడియో హక్కులు (అన్ని భాషలతో సహా) T-సిరీస్ లేబుల్‌ 9 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో బేబీ కియారా, జయరామ్, ప్రియదర్శి, శ్రుతి హాసన్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 7, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తుంది.


ప్రముఖ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల మరియు మూర్తి KS ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జ్విగాటో' Sat, Oct 26, 2024, 07:12 PM
'థగ్ లైఫ్' ఈ తేదీన విడుదల కానుందా? Sat, Oct 26, 2024, 07:06 PM
150M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పుష్ప 2' టీజర్ Sat, Oct 26, 2024, 07:00 PM
'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ అవుట్ Sat, Oct 26, 2024, 06:58 PM