బబుల్‌గమ్‌ : జాను సాంగ్ ప్రోమో అవుట్

by సూర్య | Tue, Dec 05, 2023, 03:45 PM

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మరియు ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రవికాంత్ పెరుపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'బబుల్‌గమ్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలోని మూడవ సింగల్ ని జాను అనే టైటిల్ తో డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు ఈ సాంగ్ యొక్క ప్రోమోని విడుదల చేసారు.

ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 29, 2023న విడుదల కానుంది. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ బబుల్‌గమ్‌ను నిర్మించింది.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM