'గర్ల్‌ఫ్రెండ్' షూటింగ్‌లో చేరిన కన్నడ బ్యూటీ

by సూర్య | Tue, Dec 05, 2023, 03:23 PM

కన్నడ నటి రష్మిక మందన్న తన ఇటీవలి చిత్రం యానిమల్‌ తో నెటిజన్ల నుండి ప్రశంసలు అందుకుంది. యానిమల్ ప్రొమోషన్స్ లో పాల్గొన్న కూడా విరామం లేకుండా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో అతిధి పాత్రను సజావుగా చిత్రీకరించింది. లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం, ఈరోజు తన తదుపరి ప్రాజెక్ట్స్ లో ఒకటైన గర్ల్‌ఫ్రెండ్ సెట్స్‌లో జాయిన్ అవుతున్నట్లు వెల్లడించింది. 20 రోజుల పాటు జరిగే ఈ మొదటి షెడ్యూల్‌లో రష్మికతో పాటు కొంతమంది ప్రముఖ నటీనటులు కూడా పాల్గొంటున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM