ట్రోల్స్‌పై సుప్రిత రియాక్షన్‌

by సూర్య | Tue, Dec 05, 2023, 12:25 PM

టాలీవుడ్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో చాలా ఫాలోయింగ్‌ ఉంది. సురేఖ వాణి గతంలో చాలా సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తన కూతురు సుప్రితను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉంచాలనే ప్రయత్నం ఆమె చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన కూతురితో కలిసి రీల్స్ చేస్తూ ఆ రీల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సురేఖ.


అలాగే తన కూతురు సుప్రిత కూడా ఫోటోలతో పాటు రీల్స్‌ కూడా షేర్‌ చేస్తుంటారు. అవన్నీ నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. ఒక్కోసారి కొందరు అదే పనిగా వారిని ట్రోల్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం కూడా చాలాసార్లు జరిగింది. కానీ అలాంటి వాటిని వారు పట్టించుకోకుండా వదిలేశారు. ఒక్కోసారి ఆ ట్రోల్స్‌ వారిని మరింత ఇబ్బందలకు గురి చేస్తుంటాయి. వారిని భాదిస్తాయి కూడా అప్పుడు వారు రియాక్ట్‌ కావాల్సి వస్తుంది.తాజాగా ఇలాంటి ట్రోల్స్‌పై సుప్రిత రియాక్షన్‌ ఇచ్చింది. తెలంగాణలో జరిగిన ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డిని వారు అభినందించారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోను షోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఇప్పుడు వారిద్దరిపై పలువురు నెటిజన్లు తప్పుగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు సురేఖ వాణి, సుప్రిత ఇద్దరూ బీఆర్ఎస్ గెలవాలని పలు రీల్స్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. దీంతో ఆ రీల్స్‌ను సుప్రిత తొలగించింది. ఆపై రేవంత్‌ రెడ్డితో దిగిన ఫోటోను ఆమె షేర్‌ చేసింది. దీంతో నెటిజన్లు వారిపై భారీగా ట్రోల్‌ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు.


 


 ఈ విషయంపై సురేఖ కూతురు సుప్రిత రియాక్ట్‌ అయింది. 'రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్‌కు సపోర్టు చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా గెలిచిన వ్యక్తి రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం ఏంటి..? నేను మీకేం అన్యాయం చేశాను. నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.' అని సుప్రీత పోస్ట్ చేసింది.


 


 

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM