ట్రెడిషనల్ వేర్ లో మిర్నా మీనన్

by సూర్య | Sat, Dec 02, 2023, 10:45 AM

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ (Mirna Menon)  త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నెట్టింట మాత్రం వరుస ఫొటోషూట్లతో మెరుస్తూ మైమరిపిస్తోంది. తాజా ఫొటోలు బ్యూటీఫుల్ గా ఉన్నాయి. ‘జైలర్’ కోడలు మిర్నా మీనన్ నటిగా ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’లో కోడలి పాత్రతో అలరించింది. పద్ధతిగా మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత మిర్నాకు మరిన్ని ఆఫర్లు దక్కుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. కింగ్, అక్కినేని నాగార్జున రాబోయే చిత్రం ‘నా సామిరంగ’లో ఛాన్స్ సొంతమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో మిర్నా మీనన్ సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలతో అలరించింది. కానీ పెద్దగా ఫేమ్ రాలేదు. ఇప్పుడు నాగార్జున ‘నా సామీరంగ’ చిత్రంతో టాలీవుడ్ లో సందడి చేయబోతుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన నయా లుక్స్ తో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. నెటిజన్లూ అందాల దర్శనంతో ఆకట్టుకుంటోంది. తాజాగా పంచుకున్న పిక్స్  బ్యూటీఫుల్ గా ఉన్నాయి. తాజాగా మిర్నా మీనన్ ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. వైల్ లెహంగా, వోనీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. సాధ్యమైనంత వరకు అందాలను మెరిపిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తెక్కించే ఫోజులతో మతులు పోగొట్టింది. 


 


 


 





Latest News
 
'రక్త బ్రహ్మాండం' షూటింగ్ ప్రారంభించిన సమంత Fri, Sep 20, 2024, 05:13 PM
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 13 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Fri, Sep 20, 2024, 04:36 PM
'35-చిన్న కథ కాదు' నుండి సయ్యారే సయ్య వీడియో సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:31 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' ఫస్ట్ సింగల్ Fri, Sep 20, 2024, 04:27 PM
శ్రీలీల కి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్... శ్రీలీల రియాక్షన్ ఏంటో తెలుసా ? Fri, Sep 20, 2024, 04:22 PM