'సైంధవ్' ఫస్ట్ సింగల్ కి 10,000+ రీల్స్

by సూర్య | Tue, Nov 28, 2023, 08:16 PM

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని మూవీ మేకర్స్ రాంగ్ యూసేజ్ అనే టైటిల్ తో విడుదల చేయగా ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాట 10 వేలకు పైగా రీల్స్‌ను పొందింది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కి ఇదే నిదర్శనమని చెప్పాలి.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM