ఓట‌ర్ టీజ‌ర్ వ‌చ్చేసింది

by సూర్య | Fri, Mar 15, 2019, 09:53 AM

  మంచు విష్ణు హీరో గా నటించిన తాజా చిత్రం 'ఓటర్'.. పొలిటిక‌ల్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రానికి జిఎస్ కార్తీక్ దర్శకుడు..ర‌మా రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని జాన్‌సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సుర‌భి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎస్‌.ఎస్.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా రాజేష్ యాద‌వ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. సంప‌త్‌రాజ్‌, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముళి, ప్ర‌గ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న  ఈ చిత్ర టీజర్ ని శుక్ర‌వారం విడుదల చేసింది చిత్ర బృందం.. 


ఈ టీజర్ లో "అహింసా మార్గం ద్వారా..ఒక్క బులెట్ కూడా కాల్చకుండా.. స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది.." "మనం పేదరికం పైన పోరాటం చేశాం కానీ పేదలపైనా పోరాటం చేయలేదు.." "మార్పు మనలో రావాలి..మారాలి.. మార్చాలి.. మొదటగా మనం మార్చాల్సింది దేశంలో ఉన్న రాజకీయాల నాయకులని.."అని మంచు విష్ణు చెప్పే డైలాగ్స్ ఎంతో ఎమోషనల్ గా ఉంటూ ఈ టీజర్ కే హైలైట్ గా నిలుస్తున్నాయి.. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీ గా ఉన్న ఈ చిత్రాన్ని వేసవి లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM