'ఆమని పాడవే హాయిగా' సాంగ్ లిరిక్స్

by సూర్య | Wed, Nov 22, 2023, 09:29 AM

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా ఎద స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో

సుఖాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివీభువీ కలానిజం స్పృషించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోవు గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా

Latest News
 
UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Mar 01, 2024, 09:15 PM
'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్ Fri, Mar 01, 2024, 09:13 PM
ఆఫీసియల్ : 'హనుమాన్' OTT ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Mar 01, 2024, 09:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు' Fri, Mar 01, 2024, 09:10 PM
162.5K లైక్‌లను సొంతం చేసుకున్న 'గామి' ట్రైలర్ Fri, Mar 01, 2024, 09:08 PM