'జవాన్' 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Sep 23, 2023, 04:08 PM

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 937.00 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


'జవాన్' కలెక్షన్స్::::::
తెలుగు రాష్ట్రాలు - 54.40 కోట్లు
తమిళనాడు - 44.70 కోట్లు
కర్ణాటక - 48.40 కోట్లు
కేరళ - 13.25 కోట్లు
ROI - 472.40 కోట్లు
ఓవర్సీస్ - 303.85 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 937.00 కోట్ల గ్రాస్

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM