'ధృవ నచ్చతిరమ్' రిలీజ్ చేయనున్న విజయ్ లియో నిర్మాత?

by సూర్య | Fri, Jun 09, 2023, 05:52 PM

గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ అధికారకంగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. స్పై థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు.


తాజాగా ఇప్పుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ యొక్క 'లియో' చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ తమిళ నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్ తమిళనాడు అంతటా ధృవ నట్చతిరమ్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం జులై 14న విడుదల కానుందని సమాచారం.

ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధృవ నచ్చతిరమ్‌కి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM