ఫహద్ ఫాసిల్ 'ధూమమ్' టీజర్ అవుట్

by సూర్య | Thu, Jun 08, 2023, 08:43 PM

పుష్ప: ది రైజ్‌తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన స్టార్ పెర్‌ఫార్మర్ ఫహద్ ఫాసిల్ తాజాగా మలయాళ థ్రిల్లర్ 'ధూమమ్' అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యు-టర్న్‌తో పేరుగాంచిన పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అపర్ణా బాలమురళి కథానాయికగా నటించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. కథాంశం గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ సినిమా టీజర్ ఆసక్తిని రేకెత్తించింది.

KGF మరియు కాంతారా వంటి బ్లాక్‌బస్టర్‌లను నిర్మించడంలో పేరుగాంచిన హోంబలే ఫిల్మ్స్ ధూమమ్ సినిమాని నిర్మిస్తుంది. జూన్ 23, 2023న విడుదల కానున్న ఈ పాన్-సౌత్ చిత్రంలో రోషన్ మాథ్యూ, అచ్యుత్ కుమార్ మరియు వినీత్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి SV సంగీతం అందించారు.

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM