విజయ్ యొక్క 'లియో' ప్రొమోషన్స్ పై లేటెస్ట్ బజ్

by సూర్య | Fri, Mar 24, 2023, 06:38 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. లియో అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.
 
తాజా అప్డేట్ ప్రకారం, విడుదలకు ముందే ఈ సినిమా ప్రమోషన్లు చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్ కప్ 2023లో ఈ సినిమా  ప్రమోట్ చేయబడనున్నట్లు సమచారం. ప్రపంచ కప్ అక్టోబర్ 5, 2023న ప్రారంభమవుతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలను రాబోయే రోజుల్లో మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు.

ఈ చిత్రంలో  ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్ మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.

Latest News
 
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM
14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న తెలుగు నటి Fri, May 03, 2024, 06:22 PM
'ఆవేశం' OTT అరంగేట్రం అప్పుడేనా? Fri, May 03, 2024, 06:19 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న గేమ్ ఛేంజర్ లోని 'జరగండి' సాంగ్ Fri, May 03, 2024, 06:12 PM
'డబుల్ ఇస్మార్ట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 06:07 PM