by సూర్య | Sat, Mar 18, 2023, 06:33 PM
హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం 'బలగం' తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 14.87 కోట్లు వసూళ్లు చేసింది.
వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.
'బలగం' కలెక్షన్స్ :::::
నైజాం - 9.46 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ - 5.41 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 14.87 కోట్లు (6.78 కోట్ల షేర్)