'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ డే బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 04:51 PM

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో యంగ్ హీరో నాగ శౌర్య నటించిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' సినిమా మార్చి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' మొదటి రోజున 85 లక్షల గ్రాస్ సంపాదించింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.10 కోట్ల రేంజ్‌లో వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, వారణాసి సౌమ్య, మేఘా చౌదరి, అశోక్ కుమార్, హరిణి రావు మరియు అర్జున్ ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత టి.జి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై విశ్వప్రసాద్, పద్మజ దాసరి, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

Latest News
 
'గం గం గణేశ' లో రాజా వారు గా సత్యం రాజేష్ Sat, May 25, 2024, 06:40 PM
'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్ Sat, May 25, 2024, 06:38 PM
'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Sat, May 25, 2024, 06:36 PM
నార్త్ అమెరికాలో $400K మార్క్ ని చేరుకున్న 'గురువాయూర్ అంబలనాడయిల్' Sat, May 25, 2024, 06:34 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, May 25, 2024, 06:33 PM