ఆఫిసియల్ : 'భోలా శంకర్' లో సుశాంత్

by సూర్య | Sat, Mar 18, 2023, 04:09 PM

మెహర్ రమేష్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈరోజు టాలెంటెడ్ హీరో సుశాంత్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా, 'భోలా శంకర్' సినిమాలో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సుశాంత్ సూట్‌లో కూల్ గా కనిపిస్తున్నాడు.

ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్ మూవీ వేదాళం యొక్క అధికారిక తెలుగు రీమేక్. ఈ మెగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో రావు రమేష్, మురళీ శర్మ, తులసి, వెన్నెల కిషోర్, కీర్తి సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM