రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం'

by సూర్య | Thu, Feb 02, 2023, 06:58 PM

మేఘా ఆకాష్, త్రిగుణ్, అజయ్ కతుర్వర్, మాయ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం 'ప్రేమదేశం'. శ్రీకాంత్ సిద్ధం ఈ సినిమాకు దర్శకుడు కాగా సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శిరీష సిద్ధం నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, వైవా హర్ష, వైష్ణవి చైతన్య, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు.


ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రేమదేశం మూవీ ఫైనల్గా రేపు థియేటర్లకు రావడానికి సిద్ధమయ్యింది. ట్రెండ్ సెట్టింగ్ 'ప్రేమదేశం' టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా అప్పటి మ్యాజిక్ ను వెండితెరపై ఆవిష్కరిస్తుందా? తెలుసుకోవాలంటే రేపు థియేటర్లలో ప్రేమదేశం సినిమా చూడాల్సిందే.

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM