'బుట్టబొమ్మ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల ..!!

by సూర్య | Sat, Jan 28, 2023, 11:22 AM

చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం "బుట్టబొమ్మ". ఇందులో అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ మేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


వచ్చే నెల నాల్గవ తేదీన థియేటర్లకు రాబోతున్న ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బుట్టబొమ్మ ట్రైలర్ ను లాంచ్ చేసి, చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేసారు.
ఇక, ట్రైలర్ విషయానికొస్తే, ఆహ్లాదకరమైన పల్లె వాతావరణంలో జరిగే ఒక అందమైన అడల్ట్ లవ్ స్టోరీ ఇది. రాంగ్ కాల్ తో హీరో హీరోయిన్లు కలుసుకోవడం, క్రమంగా వారిద్దరి మధ్య అనుబంధం పెరగడం, ఆపై ప్రేమగా మారడం, ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్లిపోవడం, ఈ నేపథ్యంలో అర్జున్ రామ్ దాస్ వారిని వెంటాడం.. ఇలా.. తీపి, చేదు సన్నివేశాల సమాహారంగా సాగే ఒక అందమైన అడల్ట్ లవ్ స్టోరీ. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. 

Latest News
 
'ధమ్కీ' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:58 PM
'రంగమార్తాండ' 3 రోజుల USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Sat, Mar 25, 2023, 08:50 PM
OTTలో ప్రసారానికి అందుబాటులో ఈషా రెబ్బా మలయాళ తొలి చిత్రం Sat, Mar 25, 2023, 08:34 PM
యువ దర్శకుడి స్క్రిప్ట్‌ని ఒకే చేసిన నాగ చైతన్య? Sat, Mar 25, 2023, 08:21 PM
ఇటలీలో 'సాలార్' యాక్షన్ సీక్వెన్స్ Sat, Mar 25, 2023, 08:19 PM