పొన్నియిన్ సెల్వన్ : తెలుగు బుల్లితెరపై చోళుల సందడి

by సూర్య | Wed, Jan 25, 2023, 01:42 PM

కోలీవుడ్ పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'పొన్నియిన్ సెల్వన్' సెప్టెంబర్ నెలలో విడుదలై పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆపై డిజిటల్ ఎంట్రీ చేసి అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచిన PS 1 రీసెంట్గానే తమిళ బుల్లితెరపై సందడి చేసింది. సన్ టీవీ ఛానెల్ లో జనవరి 8వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు PS 1 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఐన విషయం తెలిసిందే.తాజా సమాచారం ప్రకారం, పొన్నియిన్ సెల్వన్ తెలుగు బుల్లితెరపై సందడి చెయ్యడానికి రెడీ అయ్యిందని తెలుస్తుంది. ఈ మేరకు జెమిని ఛానెల్ లో అతి త్వరలోనే పొన్నియిన్ సెల్వన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది. మణిరత్నం డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్, విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి ప్రధానపాత్రల్లో నటించారు. AR రెహ్మాన్ సంగీతం అందించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM