హీరో అడివిశేష్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి..!!

by సూర్య | Tue, Jan 24, 2023, 06:57 PM

గతేడాది మేజర్, హిట్ 2 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుని ప్రస్తుతం సక్సెస్ జోష్ లో ఉన్నారు యంగ్ హీరో అడివిశేష్. రీసెంట్గానే అడివిశేష్ తన ఐకానిక్ మూవీ "గూఢచారి" కి సీక్వెల్ ను పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా ఎనౌన్స్ చేసారు.
తాజాగా అడివిశేష్ నివాసంలో పెళ్లి హడావిడి మొదలైనట్టు తెలుస్తుంది. ఈ రోజు హల్దీ కార్యక్రమం జరిగింది. దీంతో అంతా అడివిశేష్ పెళ్లి చేసుకుంటున్నాడని అనుకుంటున్నారు..కానీ, శేష్ చెల్లెలు షిర్లీ పెళ్లి చేసుకోబోతుంది. ఈ నెల 26న ఒక ప్రైవేట్ సెరిమోనీలో డెవిన్ గూడ్రిచ్ తో షిర్లీ వివాహం జరగబోతుంది. ఈరోజు జరిగిన హల్దీ కార్యక్రమంలో వెన్నెల కిషోర్, డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు షిర్లీ హల్దీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   

Latest News
 
ప్రముఖ తమిళ హాస్యనటుడు కన్నుమూత Sun, Feb 05, 2023, 11:18 PM
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ Sun, Feb 05, 2023, 09:58 PM
మస్కట్ కి 'ఏజెంట్' ప్రయాణం..ఎప్పుడంటే..? Sun, Feb 05, 2023, 07:29 PM
'గీత గోవిందం' డైరెక్టర్ తో రౌడీ హీరో న్యూ మూవీ ..? Sun, Feb 05, 2023, 07:24 PM
నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!! Sun, Feb 05, 2023, 07:16 PM