రేపు డిజిటల్ ఇవ్వనున్న 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'

by సూర్య | Thu, Dec 08, 2022, 10:17 AM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' సినిమా నవంబర్ 4, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ  అడ్వెంచరస్ ఫన్ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్ 9న సోనీ లివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని సమాచారం. ట్రావెల్ కామెడీగా సాగే ఈ చిత్రంలో సంతోష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేస్తుంది. బ్రహ్మాజీ, మైమ్ గోపి, సుదర్శన్, సప్తగిరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM