పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. ట్వీట్ వైరల్ !!

by సూర్య | Fri, Dec 02, 2022, 11:01 PM

మెగాపవర్ స్టార్ రాంచరణ్ గారు కొద్దిసేపటి క్రితమే ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు చరణ్ సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. పాపులర్ న్యూస్ ఛానెల్ NDTV సంస్థ అందించే ట్రూ లెజెండ్ - ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును టాలీవుడ్ కి చెందిన మెగాపవర్ స్టార్ రాంచరణ్ గారు అందుకోవడం తెలుగువారందరికీ గర్వ కారణం.


కొడుకు పొందిన ఉన్నతమైన అవార్డుకుగానూ మెగాస్టార్ పుత్రోత్సాహంతో పొంగిపోతూ ట్వీట్ చేసారు. "నాన్నా... NDTV వారు నీకు బహుకరించిన ట్రూ లెజెండ్ - ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు కు నిజంగా థ్రిల్ అయ్యాను..అలానే నిన్ను చూసి గర్వపడుతున్నాను. - అప్ప, అమ్మ" అని ట్వీట్ లో చిరు పేర్కొన్నారు. అలానే ఈ ట్వీట్ కు చరణ్ అవార్డును అందుకుంటున్న ఫోటోను, చరణ్ చిన్నప్పుడు తనతో కలిసి దిగిన ఫోటోను చిరు ట్యాగ్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Latest News
 
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.... కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత Fri, Feb 03, 2023, 12:04 AM
బాలీవుడ్ నటుడు పరేష్ రావల్‌కు హైకోర్టులో ఊరట Thu, Feb 02, 2023, 11:03 PM
సినిమా సెట్‌లో ప్రమాదం..... బంగ్లా నటి షర్మీన్ అఖీకి గాయాలు Thu, Feb 02, 2023, 10:47 PM
శర్వానంద్ తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ప్రముఖ మలయాళ స్వరకర్త Thu, Feb 02, 2023, 09:00 PM
'సూర్య42' గురించి కీలక అప్‌డేట్ Thu, Feb 02, 2023, 08:50 PM