హిందీలో విడుదల కానున్న విజయ్ 'వరిసు'

by సూర్య | Mon, Nov 28, 2022, 09:12 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతి తరహాలో ఉండనుంది అని లేటెస్ట్ టాక్. తాజాగా ఈ చిత్రం నుండి థమన్ ఎస్ కంపోస్ చేసిన మొదటి సింగిల్ రంజితమే పూర్తి పాటను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ ని సృష్టిస్తుంది.

తాజాగా ఇప్పుడు వరిసు సినిమా తమిళం మరియు తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది అని సమాచారం. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు, మూవీ మేకర్స్ హిందీలో ఒక్క పోస్టర్ కూడా రివీల్ చేయలేదు. మరి హిందీ వెర్షన్ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM