హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ సర్ప్రైజ్ ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 05:29 PM

అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా శైలేష్ కొలను తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ "హిట్ 2". 2020లో విడుదలైన హిట్ కి ఈ సినిమా అఫీషియల్ సీక్వెల్ గా తెరకెక్కింది. హిట్ ఫస్ట్ కేసు లో హీరోగా విశ్వక్ సేన్ నటించగా, సీక్వెల్ లో అంటే సెకండ్ కేసు లో అడివిశేష్ హీరోగా నటించారు. డిసెంబర్ 2న హిట్ 2 మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న కారణంగా ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ ఈవెంట్ కు ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎస్ ఎస్ రాజమౌళి గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. హిట్ ఫ్రాంచైజీ కి నిర్మాతగా వ్యవహరిస్తున్న నాచురల్ స్టార్ నాని గారు కూడా హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కానున్నారు.


తాజాగా అందుతున్న సమాచారం మేరకు, హిట్ 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా హీరో విశ్వక్ సేన్ కూడా హాజరు కాబోతున్నారని కొంతసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఒకే వేదికపై ఇంతమంది తారలు కనిపిస్తున్నారనే సరికి, హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడడానికి ఆడియన్స్ ఎంతో కుతూహలంగా ఉన్నారు.

Latest News
 
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM
ఎన్టీఆర్‌ తన భార్యని పిలిచే ముద్దు పేరేంటో తెలుసా? Sun, Mar 26, 2023, 11:20 AM
సినీ పరిశ్రమలో విషాదం Sun, Mar 26, 2023, 09:23 AM
‘రంగమార్తాండ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.? Sun, Mar 26, 2023, 09:22 AM