లేటెస్ట్ .. అల్లుఅర్జున్ తో జట్టుకట్టిన శ్రీలీల..!!

by సూర్య | Sun, Nov 27, 2022, 02:58 PM

పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ శ్రీలీల. ఆపై రవితేజ ధమాకా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇంకా, సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ ల SSMB 28 లో శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందంటూ ప్రచారం జరుగుతుంది. మరైతే, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో జత కట్టి శ్రీలీల అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.


అల్లు అర్జున్, శ్రీలీల కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతోందా? లేక పుష్ప 2 లో శ్రీలీల కూడా నటించబోతుందా? అన్న ప్రశ్నలు తలెత్తాయి.


ఐతే, ఈ ఇద్దరూ ఒక కమర్షియల్ యాడ్ షూట్ నిమిత్తం కలిసి నటించినట్టు తెలుస్తుంది. ఈ పిక్ కూడా ఆ షూటింగ్ కి సంబంధించిందే. పోతే, ఈ యాడ్ షూట్ కు త్రివిక్రమ్ డైరెక్షన్ చేసారు.

Latest News
 
నేడు స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్న 'ఉగ్రం' Tue, May 21, 2024, 04:20 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గం గం గణేశ' ట్రైలర్ Tue, May 21, 2024, 04:17 PM
'బడ్డీ' నుండి ఆ పిల్ల కనులే పూర్తి ఆడియో సాంగ్ విడుదల Tue, May 21, 2024, 04:06 PM
దేవర: ఫియర్ సాంగ్ తెలుగు వెర్షన్ లిరికల్ షీట్ అవుట్ Tue, May 21, 2024, 04:04 PM
మోహన్ లాల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కన్నప్ప' టీమ్ Tue, May 21, 2024, 03:57 PM