యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి 'వారసుడి' టీమ్ కి నోటీసు

by సూర్య | Thu, Nov 24, 2022, 04:51 PM

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వారసుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా వెంకటేష్ బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతి తరహాలో ఉండనుంది అని లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది.


ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం, వారసుడు చిత్ర నిర్మాతలకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జంతువులతో షూట్ చేయడానికి ప్రీ-షూట్ అనుమతులను మూవీ మేకర్స్ పొందకపోవడంపై బోర్డ్ మేకర్స్‌కు నోటీసును జారీ చేసింది. బోర్డు ఇప్పుడు మూవీ మేకర్స్ నుండి వివరణ కోరుతోంది మరియు వారి ప్రతిస్పందన కోసం వేచి ఉంది.

Latest News
 
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM