మై ఇన్స్పిరేషన్ .. మై సూపర్ స్టార్ - మహేష్ హార్ట్ మెల్టింగ్ పోస్ట్ ..!!

by సూర్య | Thu, Nov 24, 2022, 03:33 PM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ గారు ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ANR, శోభన్ బాబు, కృష్ణంరాజు తదుపరి కృష్ణగారి మరణంతో టాలీవుడ్ లో ఒక శకానికి ముగింపు పలికినట్టయ్యింది.


తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న మహేష్ బాబు లేటెస్ట్ గా తన సోషల్ మీడియా ఖాతాలలో హార్ట్ మెల్టింగ్ ఎమోషనల్ నోట్ ను షేర్ చేసారు. ఇందులో మహేష్ ఇలా రాసుకొచ్చారు... మిమ్మల్ని, మీ సినిమాలను ప్రేక్షకాభిమానులు ఎంతగానో ఆదరించారు.. అభిమానించారు.. మీరు చాలా గొప్పవారు.. ఎవ్వరికీ భయపడకుండా, డేరింగా, డాషింగా బ్రతికారు. ఇంతకుముందు నాలో లేని ధైర్యం, ఉత్సాహం ఇప్పుడు నాలో కనిపిస్తున్నాయి. అది మీ వల్లనే. మీరు ఎల్లప్పుడూ నాలోనే ఉంటారు. మీ లెగసీని నేను ముందుకు తీసుకెళ్తాను.. మీరు మరింత గర్వపడేలా చేస్తాను... లవ్ యూ నాన్న.. మై సూపర్ స్టార్... అని నోట్ లో రాసుకొచ్చారు మహేష్.. ఈ నోట్ చదివిన ప్రతి ఒక్కరి హృదయం బాధతో బరువెక్కుతుంది.

Latest News
 
'గుర్తుందా శీతాకాలం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ..!! Mon, Dec 05, 2022, 10:25 AM
USA లో కొనసాగుతున్న హిట్ 2 కలెక్షన్ల వేట..!! Mon, Dec 05, 2022, 10:16 AM
వివాహజీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హన్సిక..!! Mon, Dec 05, 2022, 10:05 AM
లేటెస్ట్.. వాయిదా పడిన 'ధమ్కీ' ఫస్ట్ సింగిల్ విడుదల  Mon, Dec 05, 2022, 09:52 AM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM