అక్టోబర్ 3న "ఆదిపురుష్" ఫస్ట్ లుక్ రిలీజ్ ..??

by సూర్య | Fri, Sep 23, 2022, 06:42 PM

ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ "ఆదిపురుష్" పై ఈ మధ్య కాలంలో పలు రకాల ఎక్జయిటింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. దసరా సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల కాబోతున్నాయని, అదికూడా ఢిల్లీలో అని, ఆ ఈవెంట్ కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ హాజరు అవుతారని.. ఇలా పలురకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
లేటెస్ట్ గా మరొక వార్త ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ పై వైరల్ అవుతుంది. అదేంటంటే, అక్టోబర్ 3వ తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారని, ఆపై పలు కీలకనగరాల్లో ముమ్మర ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఇన్ని వార్తలు ప్రచారంలో ఉన్నా మేకర్స్ నుండి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం విశేషం. 

Latest News
 
Funky OTT: విశ్వక్ సేన్ కొత్త సినిమా ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sat, Feb 14, 2026, 10:05 PM
60 ఏళ్ల జగపతి బాబు ఫిట్‌నెస్ రహస్యం ఇదే! Sat, Feb 14, 2026, 07:16 PM
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదుర్స్ 2 రాబోతోందా? Sat, Feb 14, 2026, 07:03 PM
‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి Sat, Feb 14, 2026, 04:08 PM
నిర్మాత నమిత్ మల్హోత్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. Sat, Feb 14, 2026, 03:48 PM