ఆచార్య, విరాటపర్వం సినిమాలు థియేటర్లలో వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం అదొక్కటే -బాహుబలి నిర్మాత

by సూర్య | Mon, Jul 04, 2022, 11:16 AM

బాహుబలి 1,2, పెళ్ళిసందడి, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య వంటి డిఫరెంట్ జోనర్ సినిమాలను తెరకెక్కించింది  ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్. ఆ సంస్థ అధినేత శోభు యార్లగడ్డ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇటీవల  థియేటర్లలో విడుదలైన తెలుగు సినిమాల ఫలితాలను విశదీకరించారు.
ఆయన మాట్లాడుతూ., కొన్ని నెలల నుండి ఆడియన్స్ పల్స్ ను అందుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 తప్పించి మిగిలిన ఏ సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోలేకపోయాయి. ఆఖరికి మెగాస్టార్, మెగాపవర్ స్టార్ కలిసి నటించిన ఆచార్య కూడా డిజాస్టర్ గా మిగిలిందంటే, నిజంగా ఇండస్ట్రీ చాలా పెద్ద షాక్ కు గురైందని చెప్పారు. బాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి బిగ్ సీనియర్ హీరోల సినిమాలకు కూడా థియేటర్లలో ప్రేక్షకులు కరువవుతున్నారని చెప్పారు.
కామెడీ ప్రధానంగా వచ్చిన డీజే టిల్లు, జాతిరత్నాలు సినిమాలు మాత్రం హౌస్ ఫుల్ రన్ తో థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సీరియస్ డ్రామా ఫిలిమ్స్ చూడటానికి థియేటర్లకు రావడానికి ఈ రోజుల్లో ప్రేక్షకులు పెద్దగా ఇంటరెస్ట్ చూపించట్లేదు. ఈ కారణం చేతనే "ఆచార్య", "విరాటపర్వం" చిత్రాలు డిజాస్టర్ లయ్యాయి. అయినా ఈ సినిమాలలో కంటెంట్ చాలా ఉండడం కూడా ఫెయిల్యూర్ కు మరొక కారణం... అని శోభు యార్లగడ్డ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM