పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా... విక్రమ్ నెక్స్ట్ మూవీ

by సూర్య | Thu, Jun 23, 2022, 04:27 PM

ఈ ఏడాది ఓటిటిలో విడుదలైన "మహాన్" తో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్. మహాన్ ఘనవిజయం తర్వాత చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం "కోబ్రా". క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 11న విడుదలబోతుంది. ఆ వెంటనే విక్రమ్ పా రంజిత్ డైరెక్షన్లో మరో మూవీ చెయ్యనున్నారు. గతేడాది డిసెంబర్ లోనే ఈ మూవీ అధికార ప్రకటన జరిగింది. తాజాగా జూలై 15వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా, భారీ స్కేల్ మీద రూపొందుతుందని, 3డి వెర్షన్లో షూటింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అఫీషియల్ గా ప్రకటిస్తామని చెప్పారు.

Latest News
 
కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం Wed, Aug 17, 2022, 11:08 PM
'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్ Wed, Aug 17, 2022, 10:53 PM
మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ Wed, Aug 17, 2022, 10:38 PM
రేపు థియేటర్లో సందడి చేయనున్న ధనుష్ 'తిరు' మూవీ Wed, Aug 17, 2022, 09:26 PM
'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 17, 2022, 09:11 PM