'కార్తికేయ 2' టీజర్ విడుదలకు తేదీ లాక్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:22 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి కార్తికేయ 2 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ చిత్రం తెలుగు మరియు హిందీలో జూలై 22, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ జూన్ 24, 2022న విడుదల చేయనున్నట్లు సమాచారం. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM