సంజ‌య్ లీలా భ‌న్సాలీతో ఎన్టీఆర్

by సూర్య | Wed, Oct 27, 2021, 02:17 PM

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప‌లు సినీ ప్రాజెక్టుల‌తో పాటు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షో తో బిజి బిజీగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అదిరిపోయే వార్త వ‌చ్చింది. పౌరాణిక పాత్ర‌లు చేయ‌డంలో ఎన్టీఆర్ ఆయ‌న తాత సీనియ‌ర్ ఎన్టీఆర్ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివ‌రీ అద‌ర‌గొడ‌తాడ‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నే లేదు. పౌరాణిక చిత్రాల‌కి పెట్టింది పేరు. ఇప్ప‌టికే బాలీవుడ్ లో ప‌లు ప‌ద్మావ‌తి..రాంలీలా,బాజీరావ్ మ‌స్తానీ, దేవ‌దాస్ చిత్రాల‌ని తెర‌కెక్కించారు.


ఎన్టీఆర్ కోసం సంజ‌య్ ప్రత్యేకంగా పౌరాణిక అంశాలతో కూడిన పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌ స్క్రిప్ట్‌ రెడీ చేశారట. భారీ ఎత్తున ఈ సినిమా నిర్మించాలని, ఎన్టీఆర్‌ని గతంలో ఎన్నడూ చూడని విధంగా వెండితెరపై ఆవిష్కరించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు ఈ భారీ సినిమా కోసం ‘జై బావ్ రే’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అన్నీ కుదిరి ఈ భారీ సినిమా సెట్స్ మీదకొస్తే అదే పెద్ద పండగ అని భావిస్తున్నారు.


 


కాగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ వర్క్స్ ఫినిష్ కాగానే కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు.. ఆ వెంటనే ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌ నీల్‌ చిత్రాన్ని కూడా ప్రారంభించి ..సరిపడా డేట్స్ ఇచ్చేస్తారట. ఈ రెండు సినిమాలతో పాటు సంజయ్ లీలా భన్సాలీతో.. ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇప్పటికే కథ సిద్ధం చేసిన సంజయ్ లీలా భన్సాలీ.. ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. ఏమ‌వుతుందో చూడాలి.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM