అరుదైన అభినేత్రి అసిన్

by సూర్య | Tue, Oct 26, 2021, 12:38 PM

విలక్షణమైన నటి అసిన్. ఆమె అందం, చందం, అభినయం అన్నీ విలక్షణంగానే ఉంటాయి. చివరకు ఆమె పేరు కూడా! ‘అసిన్’ అనే పేరులో సంస్కృతం, ఇంగ్లిష్ రెండూ కలబోసుకొని ఉన్నాయని ఆమె అంటారు. ‘సిన్’ అంటే ఇంగ్లిష్ లో పాపం అని అర్థం. దాని ముందు ‘అ’ అన్న సంస్కృత అక్షరం చేరిస్తే, ‘పాపం లేనిది’ అని అర్థం వస్తుందని ఆమె తన పేరులోని విశేషాన్ని వివరించేవారు. ఆమె నటించిన చిత్రాల రాశి తక్కువే అయినా, వాటిలోని వాసి మాత్రం ఎక్కువే అని చెప్పాలి. మాతృభాష మళయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అసిన్ అభినయం అలరించింది.అసిన్ తొట్టుంకల్ 1985 అక్టోబర్ 26న జన్మించింది. కేరళలోని కొచ్చి ఆమె జన్మస్థలం. బాల్యంలోనే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదిచింది అసిన్. అలాగే మాతృభాషతో పాటు దక్షిణాది అన్ని భాషలనూ చిన్నతనంలోనే నేర్చేసుకుంది. ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఇటాలియన్ భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. అలా మొత్తం ఎనిమిది భాషల్లో అసిన్ మాట్లాడగలదు. ఇక తాను నటించిన చిత్రాలలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా అసిన్ కు మహా ఇష్టం.


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది అసిన్. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత పూరి దర్శకత్వంలోనే నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘శివమణి’లోనూ అసిన్ నాయికగా నటించి ఆకట్టుకుంది.ఆపై బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’లోనూ, వెంకటేశ్ తో ‘ఘర్షణ’లోనూ హీరోయిన్ గా అభినయించింది అసిన్. చిత్రమేమిటంటే టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ముగ్గురూ పోలీస్ ఇన్ స్పెక్టర్స్ గా నటించిన చిత్రాలలోనే అసిన్ హీరోయిన్ గా నటిండం! ఈ నాలుగు చిత్రాలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో అసిన్ తెలుగువారి మదిలో చెరిగిపోని ముద్ర వేసుకుంది. ప్రభాస్ సరసన నటించిన ‘చక్రం’, పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టిన ‘అన్నవరం’ అంతగా అలరించలేకపోయాయి.


 


తమిళంలోనూ అసిన్ అఖండ విజయాలను చూసింది. ఆమె తమిళంలో నటించిన ‘గజినీ’, ‘దశావతారం’ వంటి చిత్రాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడి వారినీ ఆకట్టుకున్నాయి. ‘గజినీ’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది అసిన్. తొలి చిత్రంలోనే ఆమిర్ ఖాన్ తో నటించిన అసిన్ కు ‘గజినీ’ మరపురాని అనుభూతిని పంచింది. ఎందుకంటే మన దేశంలో తొలిసారి వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ‘గజినీ’ హిందీ సినిమా నిలచిపోయింది. ‘గజినీ’ తరువాత హిందీ చిత్రాలపైనే అసిన్ ఫోకస్ పెట్టింది. సల్మాన్ ఖాన్ సరసన అసిన్ నటించిన ‘రెడీ’ కూడా ఘనవిజయం సాధించింది. “హౌస్ ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786, ఆల్ ఈజ్ వెల్” వంటి హిందీ చిత్రాలలోనూ అసిన్ అందం రసికులకు బంధం వేసింది.


పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ అసిన్ చేసింది. “అవన్, మిరిండా, కాల్గేట్, ఫేయిరెవర్, తనిష్క్, బిగ్ బజార్, ప్యారాచూట్, లక్స్, అమృతాంజన్ హెల్త్ కేర్” వంటి ప్రముఖ సంస్థలకు అసిన్ మోడల్ గా నటించి ఆకట్టుకుంది. 2016లో రాహుల్ శర్మను పెళ్ళాడిన అసిన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. వారికి ఓ పాప, పేరు అరిన్. ఈ నాటికీ అసిన్ చిత్రాలు బుల్లితెరపై ప్రదర్శితమవుతూ ఉంటే అభిమానులు ఆసక్తిగా చూస్తూనే ఉండడం విశేషం!

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM