వారిపై తమన్నా ఫైర్.. లీగల్ నోటీసులు పంపిన మిల్కీ బ్యూటీ...!

by సూర్య | Tue, Oct 26, 2021, 09:22 AM

తక్కువ సమయంలోనే తమన్నా తెలుగులో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అటు తెలుగు లోనే కాకుండా తమిళ్‌లోను సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది మిల్కీ బ్యూటీ. అయితే ఇటీవలే బుల్లితెర పై కూడా ఈ చిన్నది మెరిసింది. ప్రముఖ టీవీ ఛానెల్ రూపొందించిన ఓ కార్యక్రమానికి తమన్నా హోస్ట్ గా వ్యవహరించింది. నేషనల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కుకింగ్ షో మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి హోస్ట్‌గా మిల్కీ బ్యూటీ వ్యవహరించింది. ఈ షోకి ప్రమోషన్స్ కూడా భారీ రేంజ్ లో చేశారు. అయితే హిందీలో క్లిక్ అయినట్టుగా తెలుగులో ఈ షోకి రేటింగ్స్ అంతగా రావడంలేదు. ఖ‌ర్చు ప‌రంగా చూస్తే త‌మ‌న్నాకు భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. అయితే ఇప్పుడు తమన్నా ప్లేస్ లోకి స్టార్ యాంకర్ అనసూయను తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా షో యాజమాన్యానికి షాక్ ఇచ్చింది. తనకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలంటూ నోటీసులు పంపిందని తెలుస్తుంది. తనను తొలగించారన్న అసంతృప్తితో ఉన్న తమన్నా తనకు యాజమాన్యం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు లీగల్ నోటీసులు పంపిందట. మరి ఈ నోటీసులపై షో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM