ఫ్యామిలీతో బన్నీ లాంగ్ డ్రైవ్.. ఫోటో షేర్ చేసిన స్నేహా రెడ్డి

by సూర్య | Fri, Oct 22, 2021, 04:07 PM

అల్లు అర్జున్ సినిమా షూటింగ్ లు.. ఇతర వ్యవహారాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కావాల్సినంత సమయంను ఇస్తాడనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. రెగ్యులర్ గా ఫ్యామిలీతో గడుపుతూ లైఫ్ ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసే వ్యక్తి అల్లు అర్జున్ అనడంలో సందేహం లేదు. అలాంటి అల్లు అర్జున్ ఇటీవలే విదేశీ ట్రిప్ లో ఫ్యామిలీతో సరదాగా గడిపాడు. ఆ వీడియోలు మరియు ఫొటోలను స్నేహా రెడ్డి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెల్సిందే. నెట్టింట తెగ వైరల్ అయిన ఆ ఫొటోలు వీడియోలకు తోడు మరో వీడియో వచ్చి చేరింది. ఈసారి కూడా స్నేహా రెడ్డినే వీడియోను షేర్ చేశారు. బన్నీ మరో సారి ఫ్యామిలీతో కారులో లాంగ్ డ్రైవ్ వెళ్తున్న వీడియో ఇది.


అల్లు అర్జున్ ట్రాఫిక్ లో మెల్లగా కారు డ్రైవ్ చేస్తూ ఉండగా వెనుక సీటులో అర్హ పాప క్యూట్ గా కూర్చుని ఫోన్ లో నిమగ్నమై ఉన్నది. ఇక స్నేహా రెడ్డి ఈ వీడియోను తీస్తున్నారు. కారులో గుచ్చె గులాబి పాట వస్తుంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లోని ఆ పాట మంచి సక్సెస్ అయ్యింది. అల్లు అర్జున్ కూడా అదే పాటను వింటూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది మరి అల్లు వారి క్యూట్ బాయ్ అయాన్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. లక్కీ బన్నీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చెస్తున్నారు.


అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ లో విడుదల కాబోతున్న పుష్ప సినిమా చిత్రీకరణ వచ్చే నెల రెండవ వారంకు పూర్తి చేసేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు సినిమా షూటింగ్ స్టేటస్ ను తెలియజేయడం లేదు. ఇటీవల విడుదల అయిన రెండు పాటలతో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. ముందు ముందు ఈ పాటలు మరింతగా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప మొదటి పార్ట్ డిసెంబర్ లో విడుదల కాబోతుండగా రెండవ పార్ట్ ను వచ్చే డిసెంబర్ కు విడుదల చేస్తారేమో చూడాలి. ఈ సినిమా లో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Latest News
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సరిపోద శనివారం' Fri, Apr 26, 2024, 06:42 PM
బుక్ మై షోలో 'స్త్రీ2' సెన్సేషన్ Fri, Apr 26, 2024, 06:39 PM
కేరళలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' Fri, Apr 26, 2024, 06:30 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM