ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పిన రష్మిక మందన్న?

by సూర్య | Thu, May 27, 2021, 02:41 PM

రష్మిక మందన్నఅతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా అవతరించింది. 25 ఏళ్ల ఈ భామ తెలుగులోనే కాదు, తమిళంలో సైతం వరుస ఆఫర్లు కోట్టేస్తూ... మోస్ట్ డిమాండింగ్ యాక్ట్రెస్ గా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సినీ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే విషయాన్ని వెల్లడించింది.మీరు డేటింగ్ కు వెళ్లాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ... తెలుగు స్టార్ హీరోతో తాను డేట్ కు వెళ్లాలనుకుంటున్నానని చెప్పింది. ఆ స్టార్ ఎవరో కాదు... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తనకు అవకాశం వస్తే.. ఏదో ఒకరోజు ప్రభాస్ తో డేట్ కు వెళ్తానని రష్మిక తెలిపింది. ప్రభాస్ కు తాను పెద్ద ఫ్యాన్ నని చెప్పింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. ఇదే  సమయంలో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. 'మిషన్ మజ్ను' సినిమా ద్వారా ఉత్తరాదికి పరిచయం కాబోతోంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM