ఆ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిపై దృష్టి లగ్నం చేసి ధ్యానం చేస్తా : సల్మా హయెక్

by సూర్య | Thu, Oct 08, 2020, 02:42 PM

హాలీవుడ్ తార సల్మా హయెక్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డెస్పరాడో, వైల్డ్ వైల్డ్ వెస్ట్, ఫ్రిడా, స్పై కిడ్స్-3, ఒన్స్ అపాన్ టైమ్ ఇన్ మెక్సికో వంటి చిత్రాలతో సల్మా హయెక్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. మెక్సికో దేశానికి చెందిన సల్మా తాజాగా తన ట్వీట్ లో హిందూయిజంపై అభిమానం ప్రదర్శించారు.


ఎప్పుడైతే నాలోని అంతర్గత సౌందర్యంతో సంధానం అవ్వాలనుకుంటానో, ఆ సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిపై దృష్టి లగ్నం చేసి ధ్యానం చేస్తాను అంటూ సల్మా హయెక్ ట్వీట్ చేశారు. అంతేకాదు, లక్ష్మీదేవి అమ్మవారి ఫొటోను కూడా పంచుకున్నారు. నిన్న సల్మా చేసిన ఈ ట్వీట్ కు ఇప్పటివరకు 28.9 వేల లైకులు, 7.6 వేల రీట్వీట్లు వచ్చాయి. ఎంతోమంది ఆమెను అభినందిస్తూ సందేశాలు పంపారు.

Latest News
 
ఫోటో మూమెంట్ : తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ నటుడు, దర్శకుడు Fri, Apr 26, 2024, 02:40 PM
సుహాస్‌ కోసం 'పుష్ప 2' దర్శకుడు Fri, Apr 26, 2024, 02:30 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM