నువ్వు పూర్తిగా నా మనిషివి. అలాగే నేను నీదానిని : సమంత

by సూర్య | Tue, Oct 06, 2020, 01:17 PM

కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉండగానే నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలిగా మారిపోయింది సమంత. వివాహం తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. మరోవైపు బిజినెస్ ఉమెన్‌గానూ రాణించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వివాహం జరిగి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తన భర్త నాగచైతన్యకు సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పింది. 


`నువ్వు పూర్తిగా నా మనిషివి. అలాగే నేను నీదానిని. మనం ఏ ద్వారం వద్దకు వచ్చినా.. ఇద్దరం కలిసే దానిని తెరుస్తాం. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు హజ్బెండ్ నాగచైతన్య` అని సమంత కామెంట్ చేసింది. ఇద్దరూ కలిసి తీసుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో సమంతకు ఉపాసన, రానా దగ్గుబాటి విషెస్ తెలియజేశారు.  

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM