ఆ సినిమాతో చాల నేర్చుకున : రచయిత కోన వెంకట్

by సూర్య | Tue, Mar 31, 2020, 10:53 AM

రచయితగా కోన వెంకట్ కి మంచి పేరు వుంది. ఆయన రాసిన కథలతో ఎన్నో సినిమాలు విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన నిర్మాతగాను సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "నా అసలు పేరు కోన వెంకట్రావు. ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుండగా, 'తోకలేని పిట్ట' సినిమాను నిర్మించాను. అప్పటికే నాకు పరిచయమున్న వర్మ .. వద్దని చెప్పినా నేను వినిపించుకోలేదు.సినిమా ఫీల్డ్ నాకు కొత్త కావడంతో, నేను క్యాష్ చేసుకోలేకపోయాను. ఫలితంగా నష్టాలు వచ్చాయి. మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ .. కానీ ఆ సినిమా నష్టాలతో ఉన్నవన్నీ అమ్మేసుకుని రోడ్డు మీదకి వచ్చేశాను. ఒక చిన్న షెడ్డు లాంటి ఇంట్లోకి మారవలసి వచ్చింది. పిల్లలకి ఫీజు కూడా కట్టడానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నేను ముంబైలో వున్న వర్మ దగ్గరికి వెళ్లిపోయాను" అని చెప్పుకొచ్చాడు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM