అక్కడ ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల వర్షం !

by సూర్య | Sat, Jan 18, 2020, 12:44 PM

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న ‘అల వైకుంఠపురములో’.  భారీ అంచనాల నడుమ విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అల వైకుంఠపురంలో చిత్రంతో బన్నీ యూఎస్ లో వసూళ్ల మోత మోగిస్తున్నాడు. విడుదలైన మొదటివారంలోనే ఈ చిత్రం అక్కడ $2 మిలియన్ వసూళ్లను చేరుకుంది. ఐతే 2020 కి గానూ యూఎస్ లో $2 మిలియన్ క్లబ్ లో చేరిన మొదటి ఇండియన్ మూవీ అల వైకుంఠపురంలో కావడం విశేషం. రజిని దర్బార్, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రాలు ఈ $2 మిలియన్ మార్కుకి దగ్గరగా ఉన్నప్పటికీ ఇంకా చేరలేదు. అల వైకుంఠపురంలో త్వరగా ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకొని మొదటి చిత్రంగా నిలిచింది. అలాగే బన్నీ కెరీర్ లో కూడా మొదటి $1.5 మిలియన్ మరియు $ 2 మిలియన్ చిత్రం కూడా అల వైకుంఠపురంలో కావడం విశేషం.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM